Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్షలకు మీరెలా ప్రిపేర్ అవుతున్నారు..?

Webdunia
FILE
* సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అలాంటి సమయంలో కాసేపు చదవటం చాలా మేలు చేస్తుంది. పరీక్షలకు 2 వారాల ముందుగా పూర్తిగా కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవటం మంచిది. తెలిసినవాటినే మరింత బాగా గుర్తు పెట్టుకోవాలి.

* గ్రూప్ స్టడీ చేసే పిల్లల్లో ఒకరు టాపిక్స్ గురించి చర్చిస్తుంటే, మరొకరు సినాప్సిస్ తయారు చేసుకోవటం చేయటం అవసరం. అదే విధంగా సీనియర్స్‌ను కలిసి వారెలా ప్రిపేర్ అయ్యేవారో తెలుసుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి, దేనికి ఎక్కువ, తక్కువ ప్రాధాన్యతలు ఇచ్చారో పరిశీలించాలి.

* ఒక టాపిక్‌ను చదివేందుకు 2 లేదా మూడు గంటల సమయాన్ని వెచ్చించే బదులుగా, ఒక్కోదానికి 45 నిమిషాల చొప్పున కేటాయించాలి. ఇలా చేస్తే అన్ని సబ్జెక్టులను కవర్ చేసేందుకు వీలవుతుంది. 40 నుంచి 60 నిమిషాలపాటు నిర్విరామంగా చదివిన తరువాత పది నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్‌లో మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.

* పరీక్షల సమయంలో విద్యార్థులు నిద్రను నిర్లక్ష్యం చేయటం సరికాదు. రోజుకు కనీసం 6-7 గంటలు రాత్రిపూట నిద్ర తగ్గకుండా చూడాలి. చదువుల కారణంగా మరీ అలసిపోయినట్లు అనిపిస్తే పగటిపూట కూడా ఓ పావుగంటసేపు కునుకు తీయవచ్చు. ఇలా నిద్రపోవటంవల్ల మరింత శక్తిని పుంజుకుంటారు. తద్వారా ఇంకా బాగా చదవవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి కారణ అదే : డీజీ నాగిరెడ్డి

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

Show comments