Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను చంపేందుకు పామును పడక గదిలో వదిలింది.. పాము ఎటో వెళ్ళిపోయింది.. ఆపై..?

వివాహేతర సంబంధం భర్త ప్రాణాన్ని బలిగొంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను పాము కాటుతో చంపేయాలనుకుంది. భర్త పడుకున్న పడక గదిలోకి పామును వదిలింది. తీరా ఆ

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (16:41 IST)
వివాహేతర సంబంధం భర్త ప్రాణాన్ని బలిగొంది. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భార్య దారుణానికి ఒడిగట్టింది. భర్తను పాము కాటుతో చంపేయాలనుకుంది. భర్త పడుకున్న పడక గదిలోకి పామును వదిలింది. తీరా ఆ పాము ఎటో వెళ్లిపోవడంతో... ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి భర్తను దొడ్డుకర్రలతో బాధి చంపేసింది. ఈ దారుణ ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. 
 
ఆ వివరాలను పరిశీలిస్తే.. ఐదేళ్ల క్రితం పట్టణంపూడూరుకు చెందిన శారద, శక్తివేలుకు వివాహమయ్యింది. కాగా పెళ్లికి ముందే శ్రీనగర్‌కు చెందిన సుందరంతో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. తన అక్రమసంబంధానికి భర్త అడ్డుగా వస్తాడని భావించి అతడిని ఎలాగైనా చంపేయాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. పథకం ప్రకారం పాములు పట్టే వ్యక్తికి రూ.15వేలు ఇచ్చి త్రాచు పామును భర్త నిద్రిస్తున్న గదిలోకి వదిలారు. 
 
అయితే ఆ పాము అతడిని కాటేయకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో చేసేదిలేక సుందరం అతని స్నేహితుడు రాధాకృష్ణలతో కలిసి నిద్రిస్తున్న భర్తను దొడ్డు కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో శక్తివేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం ఎవరికి కనిపించకుండా ఇంట్లో ఉండే నీళ్ల తొట్టి అడుగున పాతిపెట్టారు. కాగా శక్తి వేలు కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి శారద, ఆమె ప్రియుడు సుందరం, అతని స్నేహితుడు రాధాకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments