Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కోసం శ్రీ గురురాఘవేంద్ర సన్నిధిలో డాక్టర్ సునీల్ ప్రత్యేక పూజలు

గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సునీల్ స్థానిక

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (15:53 IST)
గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా అస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ ఉంగలుక్కాగ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సునీల్ స్థానిక టీ నగర్‌లోని గురు రాఘవేంద్ర సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. 
 
ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కోరుకున్నారు. అంతేకాకుండా, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు ఉండాలని, తమిళనాడు రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా పాలన సాగించాలని, ఇందుకోసం అమ్మకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీగురు రాఘవేంద్ర స్వామిని వేడుకున్నట్టు తెలిపారు. 
 
కాగా, ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీల్‌తో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చక్రవర్తి ఆవుల, ఆస్కా కమిటీ సభ్యులు దువ్వూరు సురేష్ రెడ్డి, కోడై చంద్ర, అంబేద్కర్  జననాయక పేరవై కార్యదర్శి జి ప్రభాకర్, ఆడిటర్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments