Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడుకు వర్ష సూచన : చెన్నై - నెల్లూరుల్లో అతి భారీ వర్షం

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (11:29 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, వాయుగుండం ప్రభావం కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని 16 జిల్లాలకు వర్ష హెచ్చరికలు చేశారు. అలాగే, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలతో పాటు ఏపీలోని నెల్లూరు జిల్లాకు అతి భారీ వర్షం హెచ్చరిక చేశారు. 
 
వాయుగుండం ప్రభావం కారణంగా చెన్నై నగరంలో ఆకాశమంతా మేఘావృతమై నల్లగా ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. అల్పపీడనం ఏర్పడింది. రేపు ఉదయానికల్లా ఇది తమిళనాడు వైపు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా చెన్నై నగంరలో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
తమిళనాడు తీర ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కావేరి పరీవాహక జిల్లాల్లో వేలాది ఎకరాల్లో భూములు నీట మునిగాయి. ఈ వర్షాల ప్రభావంతో తమిళనాడులోని కనీసం 20 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 
 
ఇటు నెల్లూరుతో పాటు గ్రేటర్ రాయలసీమకు ఇదే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో రెండు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments