Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఏళ్లైనా పెళ్లి చేయలేదని తల్లిని కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన క్యాబ్ డ్రైవర్ ఎక్కడ?

Webdunia
సోమవారం, 2 మే 2016 (18:02 IST)
తనకు పెళ్లి చేయట్లేదనే కోపంతో ఓ క్యాబ్ డ్రైవర్ కన్నతల్లినే పొట్టనబెట్టుకున్న ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. కాళ్లకు ఏర్పడిన అనారోగ్యం కారణంతో ఆ తల్లి క్యాబ్ డ్రైవర్ అయిన తన కుమారుడికి పెళ్ళి చేయలేకపోయింది. అమ్మాయిని చూడలేకపోయింది. కానీ తరచూ ఆ క్యాబ్ డ్రైవర్ తల్లితో గొడవకు దిగేవాడు. అయితే ఆదివారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చిన క్యాబ్ డ్రైవర్ తల్లిని సజీవంగా దహనం చేశాడని పోలీసులు వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. అమర్ నాథ్ (40) ఓ క్యాబ్ డ్రైవర్. అతని తల్లి పేరు శశికళ. క్యాబ్ డ్రైవర్ అయిన అమర్‌నాథ్ ఆదివారం రాత్రి బాగా తప్పతాగి ఇంటికొచ్చాడు. తల్లితో గొడవపడ్డాడు. అలా గొడవ పెద్దది కావడంతో తల్లిని బలవంతంగా కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో శశికళ తీవ్రగాయాలకు గురై మృతి చెందింది. 
 
కాలికి ఏర్పడిన అనారోగ్యం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఆమెను అరుపులు కేకలు విన్న స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో శశికళ చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అమర్‌నాథ్‌ను అరెస్ట్ చేశారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments