ఇంటి అద్దె చెల్లించాలని రెట్టించి అడిగాడనీ యజమాని హత్య? ఎక్కడ?

Webdunia
గురువారం, 9 జులై 2020 (14:47 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా పట్టణాల్లో నివసించేవారు, అద్దె ఇళ్ళలో ఉండేవారు చాలా మంది తమ తమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ఎక్కడికీ వెళ్లేదారిలేక పట్టణాల్లో ఉండిపోయారు. ఇలాంటి వారికి ఉపాధి లేకపోవడంతో మూడు నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటి యజమాన్ని అద్దె చెల్లించాలని రెట్టించి అడిగాడు. అంతే.. ఆ ఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి.. ఇంటి యజమానిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన కుండ్రత్తూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుండ్రత్తూరుకు చెందిన ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ (51) అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్రతినెల క్రమం తప్పకుండా అద్దె కడుతున్న ధనరాజ్ లాక్డౌన్ కారణంగా ఇబ్బందుల పాలవడంతో నాలుగు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. 
 
ఇదే సమయంలో అద్దె కోసం ధనరాజ్‌పై గుణశేఖర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోపం పట్టలేకపోయిన ధనరాజ్ కుమారుడు అజిత్ అర్థరాత్రి వేళ గుణశేఖర్ ఇంటికి వెళ్లి అతడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments