Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ డిజైనింగ్ శిల్పి బీఎస్ మూర్తి... ఆయన సేవలు అమోఘం

పెడ్‌గ్రో కన్సల్టెన్సీ అధినేత బుద్ధ సత్యనారాయణ మూర్తి (బీఎస్ మూర్తి) ఓ డిజైనింగ్ శిల్పి అని, ఆయన ఆర్కిటెక్చర్ సేవలు మరింత విస్తృతం కావాల్సి ఉందని పలువురు తెలుగు ప్రముఖులు ఆకాంక్షించారు.

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (13:54 IST)
పెడ్‌గ్రో కన్సల్టెన్సీ అధినేత బుద్ధ సత్యనారాయణ మూర్తి (బీఎస్ మూర్తి) ఓ డిజైనింగ్ శిల్పి అని, ఆయన ఆర్కిటెక్చర్ సేవలు మరింత విస్తృతం కావాల్సి ఉందని పలువురు తెలుగు ప్రముఖులు ఆకాంక్షించారు. చెన్నై నగరంలోని ప్రముఖ ఆర్కిటెక్చర్ కంపెనీల్లో ఒకటైన పెడ్‌గ్రో కంపెనీ 40వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం చెన్నై నగరంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకుడు బీఎస్ మూర్తి మాట్లాడుతూ... తమ కంపెనీ క్లయింట్‌లు, డిజైనింగ్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నట్టు వినమ్రయంగా చెప్పారు. గత 40 యేళ్లుగా అందించినట్టుగానే మున్ముందు కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. గత నాలుగు దశాబ్దాల్లో అనేక ఒడిదుడుకులు, కష్టాలను ఎదుర్కొన్నామన్నారు. తాము డిజైనింగ్ చేసిన అనేక భవనాలు నగరంలోనేకాకుండా దేశ విదేశాల్లో సైతం నిర్మితమై ఉన్నాయని చెప్పారు. 
 
ఆ తర్వాత ఆస్కా అధ్యక్షుడు డాక్టర్ కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ఆర్కిటెక్చర్ రంగంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పటికీ ఒదిగివుండే గొప్ప వ్యక్తి బీఎస్ మూర్తి అని కొనియాడారు. ముఖ్యంగా, మితభాషిగానేకాకుండా, మంచి మనస్సున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఏదేని సాయం కోసం ఆయన వద్దకు వెళితే ఒక కంపెనీ అధిపతిగా కాకుండా ఆస్కా కుటుంబ సభ్యుడిగా సాయం చేసేందుకు ఎల్లవేళలా ముందుకు వస్తారని చెప్పుకొచ్చారు. 
 
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జి.ఏ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ... బీఎస్ మూర్తి ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించకుండా చెడిపోయిన వారిలో తానూ ఒకడినని సభాముఖంగా వెల్లడించారు. తాను ప్రభుత్వ సర్వీసులో ఉండగా నగరంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టాలంటూ సూచనలు చేశారనీ, నాడు ఆయన చెప్పిన మాటలు వినివున్నట్టయితే ఇపుడు మిలియనీర్‌గా ఉండేవాడినని చెప్పారు. ఆయన మాట  పెడచెవిన పెట్టడం వల్ల ఇపుడు నెలవారీ ప్రభుత్వ పింఛన్ తీసుకునే ఓ రిటైర్డ్ అధికారిగా మిగిలిపోయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
బీఎస్ మూర్తి వంటి ఆర్కిటెక్చక్ నైపుణ్యాన్ని ప్రభుత్వాలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. బిల్డర్ల ఆలోచనలకు అనుగుణంగా ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందించడంలో ఆయనకు ఆయనేసాటి రాజ్‌కుమార్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొని బీఎస్ మూర్తిని అభినందిస్తూ ఆయన సేవలను కొనియాడారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments