డీన్ పదవి కోసం నగ్నపూజ.. భార్యను కూడా ఆ పూజలో..?

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (16:04 IST)
డీన్ పదవి కోసం తను నగ్నపూజ చేయటమే కాకుండా భార్యను కూడా అలాగే పూజలో పాల్గొనాలంటూ వేధిస్తున్న ఓ ప్రొఫెసర్‌ గుట్టు బయటపడింది. ధర్మపురిలోని ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సెల్వరాజ్‌ మొదటి భార్య మరణించడంతో సేలం జిల్లా కడయాంబట్టికి చెందిన కార్తీక అనే వితంతువును రెండో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి సంసారం సజావుగానే సాగింది. 
 
ఆ తర్వాతే ఆమెకు వింత పరిస్థితులు ఎదురయ్యాయి.  అదేంటంటే ఓ రోజు రాత్రి సెల్వరాజ్‌ నగ్నంగా పద్మాసనం వేసుకుని కూర్చుని ఉండటాన్ని చూసి అవాక్కయ్యింది. అదేమిటని అడిగితే కళాశాల డీన్ పదవి కోసం నగ్నపూజ చేస్తున్నానని చెప్పాడట. తొలుత భర్త నిర్వాకాన్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఓ రోజు తానొక్కడినే నగ్నపూజ చేయడం వల్ల బోరు కొడుతోందని, తనతోపాటు ఆమె కూడా నగ్నంగా పూజలో పాల్గొనాలని వేధించడం మొదలు పెట్టాడు. 
 
తాను ఇటువంటి పూజలు చేయనని చెప్పినకూడా పట్టించుకోలేదట. ఆ వేధింపులు భరించలేని కార్తీక తరచూ పుట్టింటికి వెళ్లి వస్తుండేది. కానీ, ఇటీవల ఆమెను పిలిచిన సెల్వరాజ్‌, తనతో కలిసి నగ్న పూజ చేయాల్సిందేనని, లేకుంటే విడాకులిస్తానని బెదిరించాడు. 
 
దీంతో ఆమె పుట్టింటి వారితో తిరిగొచ్చి భర్తను మార్చే ప్రయత్నం చేసింది. దీంతో కోపం చెందిన సెల్వరాజ్‌ ఆమెను గురువారం రాత్రి కుటుంబీకుల సమక్షంలోనే చితకబాదాడు. గాయపడిన కార్తీక చికిత్స కోసం ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడే కార్తీక తన భర్త వేధింపులను బయట పెట్టింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లాయల్ కష్టమర్ల కోసం మైఖేల్ చిత్ర ప్రత్యేక ప్రదర్శన

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం మ్యాజికల్ మెలోడీ

Anand Deverakonda: ఫుల్ మార్క్స్ సాధించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ టీజర్

Cherry: ఆడియన్స్‌కు ఏది నచ్చుతుందో చెప్పలేం - జెట్లీ లో కొత్తదనం ఉంది : నిర్మాత చెర్రీ

Dhanush: కర లాంటి కంటెంట్ మూవీ వస్తుంటే థియేటర్ల బంద్ ఉండదు :సీహెచ్. సతీష్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

విశాఖపట్నంలో ఫరెవర్ న్యూ మొదటి స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో బ్రాండ్ బొటిక్‌ను ప్రారంభించిన లాంజీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ది బ్రాండ్ సారా అలీ ఖాన్