Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత మరో స్కీమ్... తమిళనాడులో అమ్మ జిమ్స్... అమ్మ పార్కులు...

తన సంక్షేమ కార్యక్రమాలతో తమిళ ప్రజల మనసుల్ని దోచుకుంటున్న అమ్మ.. తన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. తమిళ ప్రజలు తనను ఎంతో అభిమానంగా పిలుచుకునే ''అమ్మ'' పేరును బ్రాండ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:48 IST)
తన సంక్షేమ కార్యక్రమాలతో తమిళ ప్రజల మనసుల్ని దోచుకుంటున్న అమ్మ.. తన కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. తమిళ ప్రజలు తనను ఎంతో అభిమానంగా పిలుచుకునే ''అమ్మ'' పేరును బ్రాండ్‌గా మార్చుకొని చెలరేగిపోవటం తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులో అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్, అమ్మ మంచినీళ్లు, అమ్మ హోటల్, అమ్మ మెడికల్ షాపు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ పేరు మీద చాలానే ఉన్నాయి. అమ్మ పేరు మీద ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యం మెరుగుపడ‌డానికి మరో రెండు పథకాలను ప్రవేశపెట్టారు. 
 
అమ్మ జిమ్, అమ్మ ఉద్యానవనాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు అమ్మ జయలలిత తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు 500 ''అమ్మ జిమ్స్ (వ్యాయామశాలలు)'', 500 ''అమ్మ పార్కులు'' ఏర్పాటు చేయాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. ఒక్కో జిమ్‌కు రూ.10 లక్షలు ఖర్చు చేయనున్నామని సీఎం జయలలిత తెలిపారు. చిన్నారులకు ఆటవస్తువులు, కూర్చునేందుకు సిమెంటు బల్లలు, టాయిలెట్లు, నడక మార్గాలు ఇతర సదుపాయాలతో గ్రామ పంచాయతీల్లో పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దాదాపు రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్ల బంధువులు విశ్రాంతి తీసుకునేందుకు 23 ''షార్ట్ స్టే హోమ్స్'' నిర్మిస్తామని కూడా తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments