Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాతో గొడవ గొడవే... కానీ అక్కడ చాలా ప్రశాంతం...

71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. ఐతే పొరుగు దేశాల నుంచి భారతదేశానికి తలనొప్పులు వుంటూనే వున్నాయి. పాకిస్తాన్ దేశంతో ఒకవైపు ఉగ్రపోరుతో సతమతమవుతుంటే చైనాతో ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత్, చైనాల మధ్య సిక్కింలోని డోక్లాంలో ఉద్రి

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (20:20 IST)
71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం. ఐతే పొరుగు దేశాల నుంచి భారతదేశానికి తలనొప్పులు వుంటూనే వున్నాయి. పాకిస్తాన్ దేశంతో ఒకవైపు ఉగ్రపోరుతో సతమతమవుతుంటే చైనాతో ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. భారత్, చైనాల మధ్య సిక్కింలోని డోక్లాంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, డ్రాగన్‌ సైనికులు మన భూభాగంలోకి చొరబడటం ఆగిపోకుండానే.. ఇరుదేశాల సరిహద్దుల్లో మిలటరీ రహిత ప్రాంతానికి సంబందించిన విశేషాలు బయటపడి ఆసక్తి గొలుపుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు. 
 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1958లో ఈ ప్రాంతంలో ఇరుపక్షాలూ తమ బలగాలను మోహరించరాదని ఇరుదేశాలూ నిర్ణయించాయట. 1962 యుద్ధం తర్వాత ఐటీబీటీ జవాన్లు ఆయుధాలు పట్టుకుని అక్కడ తిరిగినా తుపాకులను నేల మీదకు దించే ఉండాలని ఆదేశించారు. 
 
తర్వాత సరిహద్దు వివాద పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో భాగంగా జవాన్లు అసలు ఆయుధాలే తీసుకెళ్లకుండా ఉండటానికి భారత్‌ 2000 జూన్‌లో అంగీకరించింది. దీంతో ఇరుదేశాల సైనికులూ ఉన్నప్పటికీ భారత పశువుల కాపర్లూ, టిబెట్ పశువుల కాపర్లూ తమ పశువులను మేపడానికి ఇక్కడి పచ్చిక బయళ్లకు తీసుకొస్తుంటారని సమాచారం. 
 
ఇలా ఎక్కడ జరుగుతోందంటారా? పచ్చిక బీడు ప్రాంతమైన 80 చదరపు కిలోమీటర్ల బారాహోతి ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు సుమారు 140 కి.మీల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో కూడిన ‘మిడిల్‌ సెక్టార్‌’లోని మూడు పోస్టుల్లో ఇదీ ఒకటి. భారత్, చైనా సరిహద్దు రేఖ అయిన మెక్‌మోహన్‌ రేఖ బారాహోతి ద్వారా పోతుంది.
 
ఈ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు. 1958లో భారత్, చైనాలు బారాహోతిని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటిస్తూ ఇరు దేశాల్లో ఎవరూ కూడా తమ బలగాలను అక్కడ మోహరించరాదని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య డోక్లాం ప్రాంతంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బారాహోతి ప్రాంతం పరమ ప్రశాంతంగా ఉండడం సంతోషించదగిన విషయమే కదా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments