Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది హస్త నక్షత్రమా..?: ఐతే చేసిన తప్పును బేషరతుగా ఒప్పుకుంటారు!

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2014 (14:36 IST)
File
FILE
హస్త నక్షత్రంలో పుట్టిన జాతకులు చేసిన తప్పును బేషరతుగా ఒప్పుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇష్టమైన విద్యను చదువుకునే ఈ జాతకులకు మంచి మిత్రబృందం ఉంటుంది. ఇంద్రగణ నక్షత్రమైన హస్త నక్షత్రంలో జన్మించిన జాతకులు.. పెద్దలకు గౌరవం ఇస్తారు.

ఎదుటివారి కష్టసుఖాలను తేలికగా అర్ధం చేసుకునే వీరు.. ఇతరులకు అడక్కుండా సహాయం చేస్తారు. ఉన్నత భావాలు కలిగిన ఆత్మీయవర్గంతో అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే వృత్తి, ఉద్యోగాలలో శక్తి సామర్థ్యాల గుర్తింపునకు కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది.

ఇక వైవాహిక జీవితం సర్దుకుపోవడం వల్ల సజావుగా నడుస్తుంది. దూరప్రాంతాల్లో చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అన్ని విధాలా కలిసి వస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

హస్తనక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు పచ్చ, ఆరంజ్, తెలుపు రంగులు అనుకూలిస్తాయి. ఈ రంగులతో కూడిన దుస్తులను ధరించడం ద్వారా మనశ్శాంతి చేకూరడమే గాకుండా వ్యాపారాల్లో వృద్ధి, ఆర్థిక స్థితి మెరుగు వంటి శుభ ఫలితాలుంటాయి. ఇంకా పచ్చ రంగు చేతి రుమాలును ఎల్లప్పుడు వాడటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇక అదృష్ట సంఖ్యల విషయానికొస్తే.. హస్త నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఐదు అనే సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. 5, 14, 23, 32, 41, 50, 59, 68 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. కానీ 2, 3, 8, 9 సంఖ్యలు ఈ జాతకులు అనుకూలించవు.

అలాగే హస్త నక్షత్ర జాతకులకు బుధవారం అదృష్టమైన రోజు. బుధవారంనాడు ఏ కార్యాన్ని ప్రారంభించినా విజయవంతమవుతుంది. ఇంకా శని, శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలనిస్తాయి. అయితే మంగళవారం మాత్రం వీరికి అనుకూలించదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక శివరాత్రి.. రాళ్ల ఉప్పు శివలింగంపై వుంచితే?

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

అదృష్టం ఈ రాశుల వారికే.. 2025 శుక్ర గ్రహ అనుకూలంతో..?

మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?

2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?

Show comments