Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీది మిథున లగ్నమా? అయితే మీ ధర్మపత్ని సుగుణవతే..!

Webdunia
శుక్రవారం, 11 ఏప్రియల్ 2014 (17:47 IST)
File
FILE
మిథున లగ్నంలో జన్మించిన పురుషులకు బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు చెపుతున్నారు. చిన్నతనం నుంచే కుటుంబాన్ని పోషించే ఈ జాతకులు, వివాహానంతరం సుఖమైన జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇంకా మిథున లగ్నంలో పుట్టిన పురుషులకు భాగ్యవంతురాలైన సతీమణి లభిస్తుంది.

ఈ లగ్న కారులు భార్యగా పొందేవారు సుగుణవంతులుగా ఉంటారు. భర్తకు అన్ని విధాలా తోడ్పడుతారు. వ్యాపారం, కుటుంబపరమైన విషయాల్లో చేదోడువాదోడుగా ఉంటారు. తన భర్త సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచి, అందరి మెప్పును సంపాదించాలని ఆశిస్తారు. దీనికి సంబంధించి భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ, ప్రోత్సాహం అందజేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇకపోతే మిథున లగ్నంలో పుట్టిన జాతకులు తల్లి వద్ద అధికమైన ప్రేమను కలిగి ఉంటారు. కానీ తండ్రి వద్ద మాత్రం కొంత పరిమితంగా ఉంటారు. సోదరులలో తమకంటే పెద్దవాళ్లని తక్కువగానూ, తమకంటే చిన్న వారిని అధికంగాను కలిగియుంటారు. అయితే సోదరుల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి. కానీ ఆ వివాదాలను చాకచక్యంగా పట్టుదలతో పరిష్కరించుకుంటారు.

ఇంకా ఈ మిథున లగ్నంలో పుట్టిన జాతకులు భార్య ఆస్తిని ఆశించే మనస్తత్వ ధోరణి కలిగి ఉంటారు. సంతాన ప్రాప్తిలో కాస్త జాప్యం ఏర్పడవచ్చు. ఈ జాతకులు అధికంగా శ్రమించడానికి ఎక్కువగా ఇష్టపడరు.

ఈ మిథున లగ్నంలో జన్మించిన వారు ఎలాంటి వృత్తిలో స్థిరంగా ఉండరు. అప్పుడప్పుడు మారుతూనే వుంటారు. ఉద్యోగనిమిత్తం పలుదేశాలకు ప్రయాణంకోసం వెళ్తారు. అకౌంట్స్, సూపర్‌వైజర్ వంటి వృత్తుల్లో రాణిస్తారు. వ్యవసాయంలో మంచి రాణింపు ఉంటుంది.

ఇక మిథున లగ్నంలో పుట్టిన మహిళలు ఆడంబర జీవితానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా మంచి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు.

ఎలాంటి కార్యంలోనైనా ఇతరులపై అధికారం చెలాయించి, బాధ్యతతో ఆ పనిని పూర్తి చేయడంలో నిపుణులు. ఎల్లప్పుడు ఆనందంగా, ఉత్సాహం కన్పిస్తారు. మంచి గుణవంతురాలుగా ఉంటారు. మర్యాద, సంస్కారం వీరికి మెండు. భర్త వద్ద వినయంగా నడుచుకుంటారు. సంతానం అంటే వీరికి అధిక ప్రేమను కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

Show comments