Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ... మీరు తులా, వృశ్చిక లగ్నంలో జన్మించారా?

Webdunia
బుధవారం, 14 మే 2014 (17:50 IST)
File
FILE
తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగం, వృత్తిపరంగా ముందంజలో నిలుస్తారు. ఇందులో తులా లగ్నంలో జన్మించిన మహిళా జాతకులు బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యాన్ని పూర్తి చేసే వరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఎలాంటి క్లిష్టతరమైన కార్యాన్నైనా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.

ఇతరులు చేసే పనిని ఒకసారి చూసిన వెంటనే దాన్ని తిరిగే చేసే నైపుణ్యం కలిగి ఉండే ఈ జాతకులు, ఇతరుల పట్ల గౌరవభావంతో ప్రవర్తిస్తారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. భూములు, వాహనాలు కొనడంలో ఆసక్తి చూపుతారు. జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కొంటారు. బంధువులు, స్నేహితుల వద్ద స్నేహభావంతో ప్రవర్తిస్తారు.

ఇక వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళా జాతకులు ఆగ్రహావేశులుగా ఉంటారు. ఇతరుల వద్ద కఠినంగా ప్రవర్తిస్తారు. ఇతరుల ఆధీనంలో పనిచేయడంలో ఏ మాత్రం ఆసక్తి చూపరు. వీరికి కళత్ర స్థానం గొప్ప స్థానంగా అమరి ఉండటంతో భాగస్వామ్య జీవనం సుఖమయంగా ఉంటుంది. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉంటారు.

అయితే ఆర్థికపరంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాధుల వలన కొన్ని కష్టాలు ఏర్పడటం జరుగుతుంది. ఆర్థిక పరమైన వ్యయాల్లో కాస్త పొదుపును పాటించడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా తులాం, వృశ్చిక లగ్నంలో జన్మించిన జాతకులు ప్రతి శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని నేతితో దీపమెలిగిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి శుభ ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ట్రోలర్లపై ఎట్టకేలకు స్పందించిన ప్రాచీ నిగమ్.. ముఖంపై వెంట్రుకలపై..?

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

జగన్ మోహన్ రెడ్డి పార్టీకి పరోక్షంగా డ్యామేజ్ చేస్తున్న కేసీఆర్, ఎలా?

ఎముకలు, పుర్రెలతో జంతర్ మంతర్ వద్ద రైతుల ర్యాలీ

విడోలు, విడాకులు తీసుకున్న మహిళలే టార్గెట్.. కోట్లు దోచేశాడు..

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

శ్రీరామ నవమి.. అయోధ్య రామ్ లల్లాకు సూర్య తిలకం..

Show comments