Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొడ్డు మధ్య భాగంలో పుట్టు మచ్చ ఉందా?

Webdunia
మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (16:59 IST)
File
FILE
సహజంగా ప్రతి వ్యక్తికి పుట్టుమచ్చలు ప్రామాణికంగా తీసుకుంటారు. పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్‌తో పాటు.. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్లలో కూడా ఈ పుట్టుమచ్చలను ప్రధానంగా పేర్కొంటారు. వివిధ ఆకారాల్లో ఉండే నల్లటి పుట్టు మచ్చలతో మనకు పలు అదృష్టాలు అనుభవాలు కలుగుతాయని జ్యోతిష్యులు అంటున్నారు. ప్రత్యేకించి మనది హైందవమత దేశమైనందున ఆచార సాంప్రదాయాలపైనే కాకుండా ఇటువంటి వాటిపై కూడా అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు.

సాధారణంగా పెద్ద పుట్టుమచ్చలు అదృష్టాన్ని కల్గిస్తాయి. ఇక గుండ్రంగా, కోలగా ఉన్న మరికొన్ని మచ్చలు కొన్ని శుభ ఫలితాలను మరికొన్ని అశుభ ఫలితాలనిస్తాయి. అయితే, ఇవి ఎక్కడంటే అక్కడ ఉంటుంటాయి. ఇవి ఏ భాగంలో ఉంటే ఎలాంటి లాభనష్టాలు కలుగుతాయో ఓ సారి పరిశీలిస్తే...

బొడ్డు మధ్య భాగాన....
పుట్టుమచ్చ ఒకవేళ బొడ్డు మధ్య భాగాన ఉంటే స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు. పేరుప్రతిష్ఠలు సాధించి పెట్టే సంతానాన్ని కలిగి ఉంటారు. పురుషులైతే ధనవంతులుగానూ అన్నీ కార్యాల్లో విజయం సాధిస్తారు.

పెదాలపై....
పెదాలపై మచ్చ కలిగి ఉంటే ఇతరులను ప్రేమించడమే కాక, ఇతరుల ప్రేమను కూడా పొందేవారుగా ఉంటారు. వీరు ప్రారంభించిన ప్రతి పనినీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సున్నితమైన జీర్ణకోశం కలిగి ఉంటారు.

వక్షోజంపై...
స్త్రీలకైతే బుద్దిమంతుడైన కుమారుడు జన్మిస్తాడు. అదే పురుషులకున్నట్లయితే పరస్త్రీ వ్యామోహం కలిగి ఉంటారు. అన్ని మంచి కార్యాలకు స్వస్తి చెప్పి కేవలం ఇతర స్త్రీల సుఖం కోసమే పాకులాడుతూ ఉంటాడు.

కాలియందు ఉంటే...
మచ్చ కాలియందుంటే వారికి దూరదృష్టి తక్కువగా ఉంటుంది. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నేర్పుతో వ్యవహరిస్తారు. పురుషులకైతే తన మాటను గౌరవించే భార్య లభిస్తుంది. వీరికి సంతానానికి లోటుండదని జ్యోతిష్కులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

Show comments