Webdunia - Bharat's app for daily news and videos

Install App

పునర్వసు నక్షత్రమా? అయితే ఇతరులను ఆదుకుంటారు!!

Webdunia
మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (11:40 IST)
File
FILE
గురు గ్రహ నక్షత్రమైన పునర్వసు నక్షత్రములో జన్మించిన జాతకులు అవసర సమయంలో ఇతరులను ఆదుకునే గుణాన్ని కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెపుతున్నారు. సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడే ఈ జాతకులు సంతానానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇంకా ఈ నక్షత్రములో జన్మించిన జాతకులు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరు. బంగారపు ఆభరణాల కోసం పొదుపు చేస్తుంటారు. ధనూర్ విద్య, క్రీడల పట్ల ఆసక్తి, అభిప్రాయాలు, మాటలు వీరికి స్పష్టంగా ఉంటాయి.

అలాగే.. సమాజంలో ఉన్నత స్థాయి వర్గానికి నాయకత్వం వహిస్తారు. తమకు ఏర్పడే సమస్యలతో పాటు ఇతరుల సమస్యలను కూడా స్వయం శక్తితో పరిష్కరించి గుర్తింపు సంపాదిస్తారు.

ఆయుర్వేద వైద్యం, ఎగుమతి దిగుమతులు, సువర్ణము, భూమి సంబంధిత వ్యాపారాలు వీరికి లాభిస్తాయి. అయితే సంసార జీవితంలో వీరికి బేధాభిప్రాయాలు ఉంటాయి. వాటిని ప్రాథమిక దశలోనే సర్దుబాటు చేసుకోవడం ద్వారా మేలు జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇకపోతే.. ఈ జాతకులకు పసుపు రంగు అన్ని విధాలా కలిసి వస్తుంది. అందుచేత ఎప్పుడూ పసుపు రంగు కలిగిన చేతి రుమాలును ఉంచుకోవడం శుభ ఫలితాలనిస్తుంది.

ఇంకా ఈ జాతకులు బుధగ్రహ ప్రభావం ఉండటంచేత బుధవారం వీరికి కలిసొస్తుంది. గురువారం కూడా పునర్వసు జాతకులు అన్ని విధాలా అనుకూలిస్తుంది. అయితే సోమవారం మాత్రం ఈ జాతకులు ఎలాంటి పనిని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

Show comments