Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహ భుక్తి దశా కాలాలు - లాభనష్టాలేంటి?

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (16:33 IST)
File
FILE
కేతు దశాకాలం ఏడు సంవత్సరాలు. ఇందులో స్వయభుక్తిగా వ్యవహరిస్తున్న కేతు భుక్తీ కాలం నాలుగు నెలల 27 రోజులు. ఈ స్వయభుక్తి కాలం మంచి యోగాలను ప్రసాదించవు. సమస్యలతో కూడిన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాధులు ఏర్పడతాయి. స్నేహితులు శత్రువులవుతారు. ఆ భుక్తి కాలాల వల్ల కలిగే లాభనష్టాలేంటో చూద్ధాం.

శుక్ర భుక్తి- ఈ భుక్తి కాలం ఏడాది రెండు నెలలు. ఈ కాలంలో సొమ్ములు తొలగిపోయే పరిస్థితులు నెలకొంటాయి. అయితే ప్రభుత్వ మార్గం ద్వారా సహాయాలు లభించి జీవితంలో అభివృద్ది పరిస్థితులు ఏర్పడుతాయి. భాగస్వాముల సహచరణతో సంతోషాలు నెలకొంటాయి.

సూర్య భుక్తి- దీని కాలం నాలుగు నెలల ఐదురోజులు. ఈ కాలంలో అగ్ని వల్ల సమస్యలు ఏర్పడతాయి. పిశాచముల వంటి భయానిక పరిస్థితులకు గురవుతారు. తండ్రికి ఆరోగ్యకరం కాస్త దెబ్బతినటం జరుగుతాయి. అదనపు ఖర్చులు ఏర్పడతాయి. వ్యాధుల వలన అధిక ఖర్చులు ఏర్పడతాయి.

చంద్ర భుక్తి- ఈ భుక్తి కాలం ఏడు నెలలు. భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. అంతేగాకుండా భార్య భర్త మాటలను వినని పరిస్థితులు నెలకొంటాయి. కష్టపడి సంపాదించిన ఆస్తులకు నష్టం వాటిల్లుతాయి.

కుజభుక్తి- ఈ భుక్తీశుని కాలం నాలుగునెలల 27రోజులు . ఈ కాలంలో సోదరుల మధ్య వాదనలు పెరిగి విరోధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఏర్పడే కొన్నిసమస్యల వలన బంధు వర్గాలు దూరమయ్యే అవకాశాలున్నాయి.

రాహుభుక్తి- ఈ భుక్తీ కాలం ఏడాది 18 రోజులు. ఆరోగ్యంలో లోటుపాట్లు ఏర్పడతాయి. కులదైవ పూజలు చేయటం వంటివి పాటించాలి. కులదైవాలు మంచి ఫలితాలను అందజేయని కాలం. విరోధం, దోపిడీల భయం ఏర్పడతాయి. భార్యకారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి.

గురు భుక్తి- ఈ భుక్తి కాలం 11నెలల కాలం ఆరురోజులు. గురుభుక్తి వలన మంచి ఫలాలు ఆశించటం చేయొచ్చు. మంచి యోగాలు చేకూరుతాయి. కొందరికి వారి ఇష్టానుసారం భాగస్వాములు లభిస్తారు. ప్రభుత్వం ద్వారా మంతి అవకాశాలు లభిస్తాయి.

శనిభుక్తి- ఈ భుక్తీ కాలం ఏడాది నెలాతొమ్మిది రోజులు. ఈ కాలంలో మంచి ఫలాలు లభించవు. భార్యా సంతానాలను కొద్దిరోజులకు విడిపోయే ఆస్కారాలున్నాయి. మనస్సులో కలత ఎల్లప్పడూ చోటు చేసుకుంటోంది.

బుధ భుక్తి- ఈ భుక్తీ కాలం 11 నెలల 27 రోజులు . ఈ కాలంలో మంచి ఫలాలు చేకూరుతాయి. అంతేగాక కీర్తి ప్రతిష్టలు అందుతాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. లక్ష్మీ కటాక్షంతో ఆభరణాలు లభించటం, వస్తు సేకరణ లభించటం వంటివి చేస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

18-02-2025 మంగళవారం రాశిఫలాలు - సంకల్పం సిద్ధి.. ధనలాభం...

అప్పుల్లో కూరుకుపోయారా? ఈ పరిహారాలు చేస్తే రుణ విముక్తి ఖాయమట!

మహాశివరాత్రి: టీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు-అరుణాచలేశ్వరంకు ప్యాకేజీ.. ఎంత?

తులసి మొక్కను దక్షిణం వైపు నాటవద్దు.. కలబంద వంటి ముళ్ల మొక్కలను..?

Show comments