Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె "కంత్రి"నా కై"నై"ఫే అంటున్న జ్యోతిష్కులు

Webdunia
FileFILE
పుట్టినరోజు: 16 జులై, 1984,
జన్మస్థలం: లండన్, ఇంగ్లండ్, యూకే
ముద్దుపేరు: కాట్
ఎత్తు: ఐదు అడుగులా ఎనిమిదిన్నర అంగుళాలు
ఇష్టపడే నటులు: లియోనార్డో డికాప్రియో, జానీడెప్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్
నటీమణులు: కాజోల్, మాధురీ దీక్షిత్
నచ్చే క్రికెటర్: ఇర్ఫాన్ పఠాన్
ఇష్టపడే భారతీయ ఆహారం: అన్నం, దహి
నచ్చిన సినిమాలు: ఉమ్రావ్ జాన్ (1981), కాసాబ్లాంకా (1942), గాన్ విత్ ద విండ్ (1939),
ఇష్టపడే ఫెర్ఫ్యూమ్: గుస్సి రష్
ఇతర ఇష్టాలు: మోడలింగ్, నటన, డాన్స్, చెస్, సినిమాలు చూడటం, పెయింటింగ్, విశ్రాంతి, వంట, స్పాలకు వెళ్లడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, మిత్రులతో పిచ్చాపాటి

బాలీవుడ్‌లో ప్రముఖ తారగా వెలుగొందుతున్న కత్రీనా కైఫ్ లండన్ నుంచి ముంబయికి దిగుమతి అయింది. మోడల్‌గా భారత్‌లో అడుగుపెట్టిన ఆమె తరువాతి కాలంలో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కత్రీనా గత రెండు మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది.

" బూమ్‌"తో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఈ భామ ఇటీవల విడుదలైన "న్యూయార్క్"తో అభిమానులకు కన్నుల పండుగ చేస్తోంది. జులై 16, 1984న లండన్‌లో జన్మించిన కత్రీనా ముద్దు పేరు కాట్. ఆమె ఎత్తు 1.74 మీటర్లు. తండ్రి భారతీయుడు. 14 ఏళ్ల వయసులో అనుకోకుండా మోడలింగ్ అవకాశాన్ని దక్కించుకున్న కత్రీనా అనంతరం లండన్ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

ఆపై భారత్‌కు పయనమై ఇప్పుడు బాలీవుడ్ కుర్రకారుకు హుషారెక్కిస్తోంది. కత్రీకా కైఫ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా పరిచయమే. వెంకటేష్ (మల్లీశ్వరి), బాలకృష్ణ (అల్లరి పిడుగు) సరసన నటించి ఆమె తెలుగువారికి కూడా దగ్గరైంది. కత్రీనా కైఫ్ పుట్టినతేదీ ప్రకారం ఆమె రాశి కర్కాటకం.

సాధారణంగా ఈ రాశిలో జన్మించినవారు చూపరులను ఇట్టే ఆకర్షించగలరు. వయసుతో సంబంధం లేకుండా అమాయకత్వం వీరిలో ఎదుటివారికి స్పష్టంగా కనిపించే లక్షణం. చూడటానికి అమాయకంగా కనిపించినా పరిస్థితులను తేలికగా అంచనా వేసి, ఒకవేళ తమకు సరికాదు అనుకుంటే అక్కడి నుంచి నిష్క్రమించేందుకు వెనుకాడరు. స్నేహితుల విషయంలోనూ అంతే. వీరికి అదృష్టం పాళ్లు ఎక్కువనే చెప్పుకోవాలి. ప్రతికూల పరిస్థితులను వీరు ధైర్యంగా ఎదుర్కోగలరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

Show comments