Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ ఇష్టం... తమన్నా

Webdunia
పుట్టినతేది: డిసెంబర్ 21, 1989.
అదృష్ట సంఖ్యలు: 2, 4, 7.
సినీరంగంలో పేరు సాధించాలంటే అదృష్టం కావాలంటారు. అందుకే ఈ రంగంలోకి ప్రవేశించినవారిలో అతికొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానానికి చేరుకోవడం జరుగుతుంటుంది. ఇలా కొంచెం అదృష్టంతోపాటు తన అంద ం, నటనతో కొద్దికాలంలోనే హీరోయిన్‌గా మంచి స్థానానికి చేరుకున్న నటి తమన్నా. చిన్నవయసులోనే హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తమన్నా తెలుగుతోపాటు తమిళంలోనూ హీరోయిన్‌గా హవా కొనసాగిస్తోంది.

తరుణ ్, త్రిష జంటగా తమిళంలో వచ్చిన ఎనక్కు 20, ఉనక్కు 18 చిత్రంలో త్రిష స్నేహితురాలిగా నటించిన తమన్నా అటుపై ఓ హిందీ చిత్రంలో నటించింది. అటుపై తమిళంలో కేడీ చిత్రంలో నటించింది. దీని తర్వాత తెలుగులో శ్రీ అనే చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రాలేవీ తమన్నాకు సరైన గుర్తింపును తెచ్చిపెట్టలేదు. వీటి తర్వాత తమిళంలో వచ్చిన కళ్లూరి అనే చిత్రంతో తమన్నాకు ఒక్కసారి టైం కలిసివచ్చింది.

ఈ చిత్రంతో తమన్నాకు తమిళంలో అవకాశాలు పెరిగి బిజీగా మారింది. అదేసమయంలో తెలుగులో కాళిదాసు చిత్రంలో నటించిన తమన్నా తాజాగా కొంచెం ఇష్టం... కొంచెం కష్టం చిత్రంతో అందరి అభిమాన హీరోయిన్‌గా మారింది. కొద్దిరోజుల్లో ఆనందతాండవం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్న తమన్నా కెరీర్‌ను పరిశీలిస్తే కొంచెం ఆశ్చర్యం కలగకమానదు.

బాగా చిన్నవయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తమన్నా తన అవకాశాల కోసం ఓపిగ్గా ఎదురుచూసింది. ఆలోపు వ్యాపారప్రకటనల్లో కనిపించిన తమన్నా ఆ పరిశ్రమలోనూ మంచి మార్కులు కొట్టేసింది. మంచి రంగుత ో, అందంతో అందరినీ ఆకట్టుకునే రూపంతో ఉన్న తమన్నా గొప్ప హీరోయిన్‌గా పేరుతెచ్చుకునే రోజులు మరెంతో దూరంలో లేదనిపిస్తుంది.

ఎంతపేరు వచ్చినా అణుకవతో తన కెరీర్ గురించి మాత్రమే ఆలోచించడం తమన్నాకు ఫ్లస్ పాయింట్. తమన్నాలో కన్పించే ఈ లక్షణాలు ఆమె పుట్టిన తేదీ డిసెంబర్ 21కి సంబంధించిన రాశి అయిన ధనూరాశిలో జన్మించినవారందరిలోనూ కన్పిస్తాయి. ఈ రాశిలో జన్మించినవారు స్వతహాగా కాస్త అదృష్టవంతులనే చెప్పవచ్చు.

వీరి కష్టానికి అదృష్టం కూడా జతకావడంతో వీరు కెరీర్‌లో తక్కువ రోజుల్లోనే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు. ఆకట్టుకునే రూప ం, అందరికీ నచ్చే వీరి స్వభావం వీరికి అదనపు లాభం. అయితే పొగడ్తలకు పడిపోకుండ ా, అహంకారాన్ని వెంటతెచ్చుకోకుండా ఉంటే వీరి పురోగతి నల్లేరుమీద నడకే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

Show comments