Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూపు - సి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (18:42 IST)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూపు సి కేటగిరీ కింద లోయర్ డివిజన్ క్లర్క్ విభాగంలో 991, డాటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 1006 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇంటర్‌లో (12వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పరీక్ష ఫీజు కింద రూ.100 చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 
 
ఆన్‌లైన్ విధానంలో ఎస్.బి.ఐ, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఎస్.బి.ఐ బ్యాంకులో చలానా తీయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 యేళ్లకు మించి ఉండరాదు. అంటే 1987 ఆగస్టు 2కి ముందు.. 1996 ఆగస్టు 1 తర్వాత పుట్టి ఉండరాదు. 
 
ఈ పరీక్షను హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నంలలో నిర్వహిస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను రీజినల్ డైరక్టర్ (ఎస్.ఆర్), స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఈవీకే సంపత్ బిల్డింగ్, రెండో అంతస్తు, కాలేజ్ రోడ్డు, చెన్నై, తమిళనాడు 06 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 19వ తేదీలోపు పంపాల్సి ఉండగా, రాత పరీక్షలు నవంబర్ 2, 9 తేదీల్లో నిర్వహిస్తారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments