Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పాసైతే చాలు.. ఎయిర్‌ఫోర్స్‌‍లో అవకాశాలు వచ్చేస్తాయి..

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (15:55 IST)
అవును.. ఇంటర్ పాసైతే చాలు.. అవకాశాలు వచ్చేస్తాయి. ఎలాగంటే..? ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)‌లో ఇంటర్ పాసైన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీ సంగారెడ్డిలో జరగనుంది. ఈ ర్యాలీ ద్వారా ఎయిర్‌మెన్ గ్రూప్ వై-నాన్ టెక్నికల్ పోస్టుల్ని భర్తీ జరగనుంది.

సంగారెడ్డిలోని సుల్తాన్ పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఈ నెల 16 వ తేదీ నుంచి 21 వరకు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుంది. 
 
కానీ ఈ ఉద్యోగాలకు వివాహం కాని పురుషులు మాత్రమే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇంగ్లీష్‌లో ఇంటర్ రెండు సంవత్సరాల్లో 50 శాతం మార్కులు ఉండాలి. 
 
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, రాత పరీక్ష, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆరు నెలల నుంచి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో స్టైఫండ్ ఇస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ. 26,900ల వేతనం లభిస్తుంది. అదనపు వివరాలకు https://airmenselection.cdac.in/ అనే వెబ్ సైటును సంప్రదించవచ్చు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments