Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బిట్‌శాట్ 2008" ప్రవేశాలకై నోటిఫికేషన్

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2008 (16:17 IST)
FileWD
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్‌శాట్) 2008 సంవత్సరానికిగానూ వివిధ క్యాంపస్‌లలో, వివిధ కోర్సుల ప్రవేశానికై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

క్యాంపస్‌లు, కోర్సుల వివరాలు ఇలా ఉన్నాయి. పిలానీ క్యాంపస్‌లో బీఈ ఆనర్స్, బీఫార్మసీ ఆనర్స్, ఎంఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. అలాగే గోవా క్యాంపస్‌లో బీఈ ఆనర్స్, ఎంఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ టెక్నాలజీలు... హైదరాబాద్ క్యాంపస్‌లో బీఈ ఆనర్స్, బీఫార్మసీ ఆనర్స్, ఎంఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఆహ్వానిస్తున్నారు.

విద్యార్థుల అర్హతా ప్రమాణాల విషయానికొస్తే... ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథ్స్ సబ్జెక్టులలో 80 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా, బిట్‌శాట్ 2008లో వచ్చిన స్కోరు ఆధారంగానే అడ్మిషన్ కల్పించనున్నారు.

ఇందుకు చేయాల్సిందల్లా... బిట్‌శాట్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారాలను పూర్చిచేసిన తరువాత, నిర్దేశిత ఫీజును, "బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ" పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్‌ను తీయాలి. ఈ డీడీని "స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, జైపూర్, పిలానీ (కోడ్ : 10398), లేదా యూకో బ్యాంక్ విద్యావిహార్, పిలానీ (కోడ్ : 0150) లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిలానీ (కోడ్ : 11309)"లో చెల్లే విధంగా తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు 200 రూపాయలు కాగా, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను నవంబర్ 29, 2008లోపు "అడ్మిషన్స్ ఆఫీసర్స్, బిట్స్, పిలానీ - 333031" అనే అడ్రస్సుకు పంపించాలి. మరిన్ని వివరాలు కావాల్సినవారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిట్స్అడ్మిషన్.కామ్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments