Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బార్క్‌'లో ఉద్యోగ అవకాశాలు

Webdunia
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)లో పలు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తారాపూర్, కల్పాక్కం, ముంబై, గుల్మార్గ్/శ్రీనగర్‌లలో ఈ పరిశోధనా కేంద్రాలు ఉన్న విషయం తెల్సిందే. ఇదిలావుండగా.. కేటగిరీ-1 కింద మెకానికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఐటీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, అగ్రికల్చర్, బయో సైన్స్, లైఫ్ సైన్స్‌ విభాగాల్లో మొత్తం 183 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

అలాగే.. కేటగిరీ-2లో ప్లాంట్ ఆపరేటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, ఏసీ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ట్యూనర్, మైలర్, గ్రైండర్, ఆప్టిక్స్, లైబ్రరీ, లేబోరేటరీ విభాగాల్లో 273 పోస్టులకు దరఖాస్తులను కోరుతున్నారు. కేటగిరీ-1 పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

కేటగిరీ-2 పోస్టులకు దరఖాస్తు చేయదలచిన ఔత్సాహిక అభ్యర్థులు యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుల భర్తీలో ప్రస్తుతం అనుసరిస్తున్న రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా సమర్పించాల్సి వుంటుంది. పై పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు శిక్షణా కాలంలో రూ.ఆరు వేలు (కేటగిరీ-1), రూ.4000 నుంచి రూ.ఐదు (కేటగిరీ-2) వేలు చొప్పున చెల్లిస్తారు. రాతపరీక్ష, మౌఖిక పరీక్షల్లో ఎంపిక విధానం ఉంటుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments