Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేషనల్ బ్రైన్ రీసెర్చ్ సెంటర్‌‌లో అవకాశాలు

Webdunia
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ బ్రైన్ రీసెర్ట్ సెంటర్‌లో సైంటిస్ట్‌, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలోని మానేసర్‌లో ఉన్న ఈ సెంటర్‌ను డీమ్డ్ విశ్వవిద్యాలయంగా పరిగణిస్తున్నారు.

దేశ రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రైన్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్-4, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నీషియన్-బి, టెక్నీషియన్-ఏ‌ పోస్టులతో పాటు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ప్రాజెక్టు అసోసియేట్స్ (ప్రోగ్రామింగ్స్), ప్రాజెక్టు అసోసియేట్స్ (లాంగ్వేజ్ డిసోర్డర్), కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ పోస్టులకు కనీస వేతనం నాలుగు వేల రూపాయల నుంచి గరిష్టంగా 22,400 రూపాయలను అందజేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయదలచుకున్న అర్హత కలిగిన అభ్యర్థులు సెంటర్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడు చేసుకోవాల్సి ఉంటుంది. భర్తీ చేసిన ధరఖాస్తులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎబీఆర్‌సీ, నైన్వాల్ మోడ్, ఎన్.హెచ్-8, మానేసర్-122 050 అనే చిరునామాకు పంపాలి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను 8-14 తేదీల మధ్య ప్రచురితమైన ఎంప్లాయిమెంట్ న్యూస్ వారపత్రికలో చూడొచ్చు. దరఖాస్తులు ఈనెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా చేరాలి. దరఖాస్తుతో పాటు విధిగా రూ.50 విలువ చేసే, ఏదేని జాతీయ బ్యాంకులో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి, ఇలా జతచేయని దరఖాస్తులు తిరస్కరిస్తారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments