Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలు

Webdunia
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి కింద వివరాలు పేర్కొనడం జరిగింది. వివిధ విభాగాల్లో హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులున్నాయి.

హెడ్ కానిస్టేబుల్- రేడియో ఆపరేటర్.. మొత్తం 244 ఖాళీలు. రేడియో మరియు టీవీ లేదా ఎలక్ట్రానిక్స్‌లో ఐటీఐ లేదా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ చేసిన వారై ఉండాలి. వయసు.. 2009, అక్టోబర్ 10వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల వయసు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

హెడ్ కానిస్టేబుల్- ఫిట్టర్.. మొత్తం ఆరు ఖాళీలున్నాయి. ఇంజిన్ ఫిట్టర్ లేదా డీజిల్ మెకానిక్ లేదా మెటార్ మెకానిక్‌లో ఐటీఐ లేదా ఆటో మొబైల్ లేదా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ చేసిన వారై ఉండాలి. వయసు.. 2009, అక్టోబర్ 10వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల వయసు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- రేడియో మెకానిక్... మొత్తం 42 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్ లేదా రెడియో అండ్ టీవీ టెక్నాలజీ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన వారై ఉండాలి. లేదా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

2009, అక్టోబర్ 10వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలవారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. వేతనం.. రూ. 5,200 నుంచి రూ. 20,200 + గ్రేడ్ పే.. రూ. 2,400 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సదరు అభ్యర్థి.. ఎత్తు.. 170 సెం.మీ ఉండాలి. ఛాతీ- గాలి పీల్చినపుడు.. 80 సెం.మీ వరకు ఉండాల్సి ఉంటుంది.

శారీరక, రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. 2009, నవంబర్ 10న దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ. మరిన్ని వివరాలకు ' డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌బీఎస్ఎఫ్‌డాట్‌నిక్‌డాట్ఇన్' లో చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

Show comments