Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: పోలీసు శాఖలో 6,718 ఉద్యోగాలు

Webdunia
ఢిల్లీ పోలీసు శాఖలో 6,718 కానిస్టెబుల్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింద ఇవ్వబడింది.

ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్.. మొత్తం 6,302 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 945, ఎస్టీలకు.. 473, ఓబీసీలకు.. 1,702, జనరల్ కేటగిరీలకు.. 3,182 ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. పురుషుల మాత్రమే అర్హులు. 2009, జూలై 1వ తేదీ నాటికి.. 21 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎత్తు.. 170 సెం.మీ, ఛాతీ.. 81 సెం.మీ (పీల్చినపుడు 85 సెం.మీ)ల మేరకు శారీరక అర్హతలు ఉండాలి.

ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్.. మహిళలకు మాత్రమే. మొత్తం 416 ఖాళీలున్నాయి. ఎస్సీలకు.. 62, ఎస్టీలకు.. 31, ఓబీసీలకు.. 112, జనరల్ కేటగిరీలకు.. 211 సీట్లున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. 2009, జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎత్తు.. సెం.మీ.ల మేరకు శారీరక అర్హతలు ఉండాలి.

ఈ రెండు రకాల పోస్టులకు వేతన శ్రేణి.. రూ. 5,200 నుంచి 20,200లతో పాటు.. గ్రేడ్ పే కింద.. రూ. 2వేల వరకు ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తు రుసుము కింద.. 'డీసీపీ/రిక్రూట్‌మెంట్ సెల్, న్యూ పోలీస్ లైన్, ఢిల్లీ' పేరిట రూ. 100 డీడీని తీయాలి. దీన్ని దరఖాస్తుకు జతచేసి పంపాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

2009, నవంబర్ 7వ తేదీ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు లేదా దాని నమూనా పొందవచ్చు. మరిన్ని వివరాలకు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌ఢిల్లీపోలీస్‌డాట్‌నిక్‌డాట్ఇన్'లో చూడండి.

దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, నవంబర్ 11.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
పోస్ట్ బాక్స్ నెంబర్. 8020,
ఢిల్లీ- 110 033.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments