Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: పశస్త్ర సీమబల్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలు

Webdunia
పశస్త్ర సీమబల్‌ (ఎస్ఎస్‌బీ)లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేపట్టారు. దీనికి సంబంధించి అర్హతలు, ఖాళీలు తదితర వివరాలను కింద చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్.. మొత్తం 237 ఖాళీలున్నాయి. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు.. మొత్తం 125 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 20, ఎస్టీలకు.. 9, ఓబీసీలకు.. 34, జనరల్ కేటగిరీకి.. 62 సీట్లు చొప్పున కేటాయించారు. అలాగే ఇతర ఖాళీలు.. మొత్తం 112 ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు.. 18, ఎస్టీలకు.. 8, ఓబీసీలకు.. 30, జనరల్ కేటగిరీలకు 56 సీట్ల చొప్పున కేటాయించారు.

పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వేతన.. రూ. 5,200 నుంచి రూ. 20,200 వరకు ఉంటుంది. దీంతో పాటు గ్రేడ్ పే రూ. 2వేల వరకు అదనంగా లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2009, ఆగస్ట్ 1వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. ఓబీసీలకు మూడేళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తుదారులు.. 170 సెం.మీ ఎత్తు, 80 సెం.మీల ఛాతీ (గాలి పీల్చినపుడు 85 సెం.మీ) మేరకు ఉండాలి. దృష్టి లోపం ఉండరాదు. (వివిధ ప్రాంతాల వారికి.. ఎస్టీలకు శారీక అర్హతల్లో సడలింపు ఉంటుంది). ' The Commandant 25th Bn SSB' పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్కే పురం, న్యూఢిల్లీ- 1076 నందు చెల్లే విధంగా రూ. 50 డీడీ దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనిక ఉద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

పూర్తి చేసిన దరఖాస్తుకు.. అభ్యర్థులు తమ స్వంత చిరునామా గల రెండు కవర్లను జతచేయాలి. దరఖాస్తు కవరుపై 'అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ (జీడీ)' అని రాసి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ.. 2009, అక్టోబర్ 26. మరిన్ని వివరాలకు ' హెచ్‌టీటీపీ://ఎస్ఎస్‌బీడాట్‌నిక్‌డాట్ఇన్' వెబ్‌సైట్ చిరునామాలో చూడండి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
The Commandant,
25 th Bn (SSB) Ghitorni, PO:
Arjungarh, New Delhi- 110 047.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments