Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

Webdunia
భారతీయ సైనిక, నౌక, వైమానిక అకాడెమీల్లో ప్రవేశాన్ని కోరుతూ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)- 2010 పేరిట యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి కింద వివరాలు తెలపడం జరిగింది. కోర్సు, ఖాళీలు, అర్హతల వివరాలను తెలపడం జరిగింది.

భారతీయ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్.. మొత్తం 250 ఖాళీలు. ఏదేనీ గుర్తింపు పొందిన యూనివర్శిటి నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 1987, జనవరి 2వ తేదీ నుంచి 1992, జనవరి 1వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. వివాహం కాని పురుషులై ఉండాలి.

భారతీయ నావికా అకాడెమీ, ఎజిలా.. మొత్తం.. 40 ఖాళీలున్నాయి. గణితం, ఫిజిక్స్‌లతో బీఎస్సీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ అర్హత కలిగిన వారై ఉండాలి. 1989, జనవరి 2 నుంచి 1992, జనవరి 1 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎన్‌సీసీ లేదా నావెల్ వింగ్‌లో 'సీ' సర్టిఫికెట్ కలిగిన వారు మాత్రం 1987, జనవరి 2 నుంచి 1992, జనవరి 1 మధ్య జన్మించి ఉన్న వారు అర్హులు. దీనికి కూడా వివాహం కాని పురుషులై ఉండాలి.

ఎయిర్ ఫోర్స్ అకాడెమీ, హెదరాబాద్.. మొత్తం 32 ఖాళీలు. గణితం, ఫిజిక్స్‌లతో ఇంటర్మీడియట్ అలాగే ఏదేని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. 1988, జనవరి 2 నుంచి 1992, జనవరి 1వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. అవివాహితులై ఉండాలి.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నై (పురుషులు).. మొత్తం 175 ఖాళీలు. ఏదేని యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 1986, జనవరి 2 నుంచి 1992, జనవరి 1వ తేదీ మధ్యన జన్మించిన వారై ఉండాలి.

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నై (స్త్రీలు).. మొత్తం.. 18 ఖాళీలున్నాయి. ఏదేనీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 1986, జనవరి 2 నుంచి 1992, జనవరి 1 మధ్యన జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా తగిన శారీరక అర్హతలు ఉండాలి.

రూ. 100 విలువ గల సెంట్రల్ రిక్రూట్మెంట్ ఫీ స్టాంపు ధరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. ఇది పోస్టాఫీసులో లభిస్తుంది. మహిళలు లేదా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. ఎంపిక చేసిన హెడ్ పోస్టాఫీసుల్లో రూ. 20 చెల్లించి దరఖాస్తులు స్వీకరించవచ్చు.

దరఖాస్తులు స్వీకరించు ఆఖరు తేది.. 2009, అక్టోబర్ 26. దీనికి సంబంధించి రాత పరీక్ష.. 2010, ఫిబ్రవరి 14వ తేదీన జరుగుతుంది. మరిన్ని వివరాలకు ' హెచ్‌టీటీపీ://యూపీఎస్‌సీడాట్‌జీవోవీడాట్ఇన్‌' లో చూడవచ్చు.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా..
సెక్రెటరీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,
దోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్,
న్యూఢిల్లీ- 110 069
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

Show comments