Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబ్స్: ఇండియన్ నేవీ ఉద్యోగాలు

Webdunia
ఇండియన్ నేవీ ఆర్మమెంట్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్షన్ కేడర్ 2010, జూలై కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు.

పందొమ్మిదిన్నర ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు లోపు వారు అర్హులు (1985, జూలై 2 నుంచి 1991, జనవరి 1వ తేదీ మధ్యన జన్మించి ఉండాలి). అలాగే అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే దీనికి అర్హులు. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ బ్రాంచ్‌లలో బీటెక్ లేదా బీఈ లేదంటే.. ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారై ఉండాలి.

కనీస ఎత్తు.. 157 సెం. మీటర్లు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు తప్పనిసరిగా ఉండాలి. దృష్టి లోపం ఉండకూడదు. షార్ట్ లిస్ట్ అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ఐదు రోజుల పాటు రెండంచెల్లో ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. మొదటి దఫాలో ఇంటలిజెన్స్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది.

స్టేజ్- 2లో సైకలాజికల్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ రెండు దశలను విజయవంతంగా ముగించిన వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి కోర్సుకు ఎంపిక చేస్తారు. వేతనం... రూ. 15,600 నుంచి 39,100 ఉంటుంది. దీంతో పాటు.. గ్రేడ్ పే కింద రూ. 5,400 అలాగే ఎంఎస్‌పీ కింద్ రూ. 6,000 మరియు ఇతర ప్రోత్సాహకాలు (అలవెన్సులు) ఉంటాయి.

తొలుత సబ్‌లెఫ్టినెంట్‌గా కెరీర్ ప్రారంభమవుతుంది. 2010, జూలైలో దీనికి సంబంధించి శిక్షణ ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు.. ' డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌నౌసేనాభారతిడాట్‌నిక్‌డాట్ఇన్' దరఖాస్తులు స్వీకరించు ఆఖరు తేది.. 2009, నవంబర్ 14.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా...
ఇండియన్ నేవీ,
పోస్ట్ బ్యాగ్ నెంబర్- 04,
చాణక్యపురి, న్యూఢిల్లీ- 110 021.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: రామ్ చరణ్ పెద్ది నుంచి రామ్‌ బుజ్జిగా దివ్యేందు శర్మ

మురళి నాయక్ తల్లిదండ్రులకు లక్ష రూపాయలు అందజేసిన బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ

Malavika : ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారు : మాళవిక మోహనన్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Show comments