వివిధ విభాగాల్లో ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల పత్రికా ప్రకటనను విడుదల చేసింది. గ్రూప్-ఎలో ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కంట్యాక్స్ / సెంట్రల్ ఎక్సైజ్ / ప్రివెంటీవ్ ఆఫీసర్ / ఎగ్జామినర్), అసిస్టెంట్స్ (సీఎస్‌ఎస్), అసిస్టెంట్ (కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సీవీసీ)లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అలాగే, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్, సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, స్టాటిస్టికల్ ఇన్వెస్ట్‌గేటర్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు చేస్తున్నారు. గ్రూప్-బి ఉద్యోగాల్లో ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ / అకౌంటెంట్, యూడీసీ, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఏప్రిల్ 15వ తేదీ 2011లోపు పంపాల్సి ఉంటుంది.