Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీహెచ్‌డీ ఫెలోషిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
క్రిమినాలజీ అండ్ పోలీస్ సైన్స్‌లో గౌరవ డాక్టరేట్ చేయాలని తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) ఫెలోషిప్ అందజేయనుంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఫెలోషిప్‌లు ఆరు ఉన్నాయి. దీని కింద మొదటి రెండేళ్లు నెలకు రూ.8000, మూడో ఏడాది నెలకు రూ.9000తో పాటు కాంటిజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.10,000, డిపార్ట్‌మెంటల్ అసిస్టెన్స్ కింద ఏడాదికి రూ.3,000 అందించనున్నారు.

దీనికి అర్హతగా క్రిమినాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, సోషల్ ఆంత్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లా, పోలీస్ అడ్మినిస్ట్రేషన్‌ల్లో దేనిలోనైనా 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే, జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్ లేదా రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్లెట్ పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి ప్రాధాన్యం. ఏదైనా భారతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయడానికి పేరు నమోదు చేసుకుని ఉండాలి. చేసిన దరఖాస్తులను ది డెరైక్టర్, జనరల్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, బ్లాక్ నెంబర్-11, ఫోర్త్ ఫ్లోర్, సీజీఓ కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూఢిల్లీ-110003కి జులై పదో తేదీలోపు పంపాల్సి ఉంటుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments