Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ తేదీల వెల్లడి!

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (19:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ కౌన్సెలింగ్ తేదీలను వెల్లడించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అక్టోబరు 10వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 
 
సోమవారం వెల్లడించిన ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. అక్టోబరు 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లును ఎంచుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అభ్యర్థులకు తొలి విడత కౌన్సెలింగ్ కేటాయింపు జరుగుతుంది. 
 
చివరి విడత కౌన్సెలింగ్ అక్టోబరు 23వ తేదీ నుంచి మొదలుకానుంది. తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 23 నుంచి 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్టోబరు 28వ తేదీన ఎంబీఐ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, ఈ ఐసెట్ కౌన్సెలింగ్ అక్టోబరు 10వ తేదీ నుంచి ప్రారంభమై అదే నెల 28వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments