రైల్వే శాఖలో ఉద్యోగ జాతర.. 9970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఠాగూర్
బుధవారం, 26 మార్చి 2025 (16:19 IST)
భారతీయ రైల్వే శాఖలో ఉద్యోగ జాతర మొదలైంది. ఏకంగా 9970 పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీఅయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించిన 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీని మే 9గా నిర్ణయించారు. 
 
దరఖాస్తు చేసుకునేవారు ఆన్‌లైన్ ద్వారా ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250గా చెల్లించాల్సి ఉంటుంది. 
 
టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనవర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనిష్ట వయసు 18 నుంచి గరిష్ట వయసు 33 యేళ్లుగా ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంది. దివ్యాంగులకు, మాజీ సైనికోద్యోగులకు పదేళ్ల అదనపు సడలింపు ఉంది. 
 
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు అన్ని అలవెన్సులతో కలుపుకుని రూ.50 వేలకు పైగానే ఉండొచ్చని ఆర్ఆర్బీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments