Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్‌ఈ, బీటీలో ఫ్యూచర్‌ ఫ్రూఫ్‌ బీ టెక్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న నిట్‌ యూనివర్శిటీ

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (22:31 IST)
ఉన్నత విద్యలో వినూత్నతను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో వృద్ధి చెందుతున్న విభాగాలలో అభ్యాసాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పడిన లాభాపేక్ష లేని సంస్థ నిట్‌ యూనివర్శిటీ ఇప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మరియు బయోటెక్నాలజీలో బీటెక్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది.
 
విద్యార్థులను భవిష్యత్‌కు సిద్ధంగా తీర్చిదిద్దడంలో బీటెక్‌ సీఎస్‌ఈ, బీటీ ప్రోగ్రామ్‌లు రెండూ కూడా నేటి సాంకేతిక మరియు వ్యాపార వాతావరణంలో బహుళ అంశాలను అన్వేషించాల్సిందిగా ప్రోత్సహిస్తాయి. ఎన్‌యు వద్ద కరిక్యులమ్‌ ఎప్పుడూ కూడా భవిష్యత్‌లో ఉత్సాహపూరితమైన కెరీర్స్‌లో గ్రాడ్యుయేట్ల ఉపాధి అవకాశాలను పొందడాన్ని ప్రోత్సహిస్తుంది.
 
ఎన్‌యు యొక్క బీటెక్‌ సీఎస్‌ఈ ప్రధానంగా, డిజిటల్‌ పరివర్తన సాంకేతికతలపై దృష్టి సారించడంతో పాటుగా విద్యార్థులకు కంప్యూటింగ్‌ పట్ల అవగాహన, వారి దరఖాస్తులలో నైపుణ్యాల అవగాహన మరియు అప్లయ్డ్‌ కంప్యూటింగ్‌లో ఆచరణాత్మక అనుభవం అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ బిగ్‌ డాటా ఇంజినీరింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేథస్సు మరియు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో స్పెషలైజేషన్‌ను అందిస్తుంది.
 
ఎన్‌యు యొక్క బీ టెక్‌ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌ను థియరిటికల్‌ జ్ఞానంతో  పాటుగా బయోటెక్నాలజీ రంగం యొక్క వ్యాపార అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. మైక్రో బయాలజీ, బయోలాజికల్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ టెక్నిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీ, బయో ఇన్‌ఫార్మిటిక్స్‌ వంటి అంశాలలో శిక్షణ అందిస్తారు. ఈ ప్రోగ్రామ్‌తో ఇండస్ట్రీయల్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ బయోఇన్‌ఫార్మిటిక్స్‌లో స్పెషలైజేషన్స్‌ అందిస్తారు.
 
డాక్టర్‌ ప్రభు అగర్వాల్‌, అధ్యక్షుడు (వైస్‌ ఛాన్స్‌లర్‌) నిట్‌ యూనివర్శిటీ మాట్లాడుతూ, ‘‘ఈ బిటెక్‌ ప్రోగ్రామ్‌లను విద్యార్థులను  భవిష్యత్‌కు సిద్ధంగా మార్చేందుకు తీర్చిదిద్దాము. మారుతున్న నేటి పని వాతావరణంలో అవాంతరాలు లేని కెరీర్‌కు ఇవి దోహదం చేస్తాయి. ఈ నెలారంభంలో మా 10వ స్నాతకోత్సవం జరుపడంతో పాటుగా అర్హత కలిగిన విద్యార్థులు. భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ సంస్థలలో ఉద్యోగాలలో నియమితులయ్యారు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments