Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు...

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (12:54 IST)
అణు విభాగానికి చెందిన హైదరాబాద్ నగరంలోని న్యూక్లియల్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లోని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పలు పోస్టులకు అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వీటిలో ఫిట్టర్, టర్నర్, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రిషియన్, అప్రెంటిస్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మొత్తం 206 పోస్టులు ఉన్నట్టు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
మెషినిస్ట్, (మెషినిస్ట్ గ్రైండర్), అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్‌స్ట్రుమెంట్ మెకానిక్, మోటార్ మెకానిక్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ విభాగాల్లో అప్రెంటిస్‌లను ఎంపిక చేయనున్నారు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వీరి వయోపరిమితితి దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050వరకు ఇస్తారు. పదోతరగతి/ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
ఎలక్ట్రిషియన్, వెల్డర్ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఎన్పీఎస్ పోర్టల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం చివరి తేదీని సెప్టెంబరు 30వ తేదీగా నిర్ణయించారు. వెబ్‌సైట్ : https://nfc.gov.in/

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments