Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 19లక్షల వార్షిక ప్యాకేజీలతో రికార్డ్-బ్రేకింగ్ ఆఫర్‌లను పొందిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్ విద్యార్థులు

ఐవీఆర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (18:41 IST)
హైదరాబాద్: కెఎల్‌ఈఎఫ్ (కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ నుండి తమ విద్యార్థులు అగ్రశ్రేణి బహుళజాతి సంస్థలు (ఎంఎన్‌సిలు) సహా ప్రఖ్యాత కంపెనీల నుండి బహుళ బల్క్ ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను పొందడం ప్రారంభించారని వెల్లడించింది. ఈ అద్భుతమైన విజయాలు కెఎల్‌ఈఎఫ్ యొక్క బలమైన పరిశ్రమ-విద్యా సహకారం, కఠినమైన శిక్షణా పర్యావరణ వ్యవస్థ, వ్యక్తిగతీకరించిన మార్గదర్శక సంస్కృతి ద్వారా నడిచే విద్యార్థులు, అధ్యాపకుల స్థిరమైన ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి.
 
ఇటీవల, 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ నుండి పన్నెండు మంది అత్యుత్తమ మూడవ సంవత్సరం బిటెక్ విద్యార్థులు ఒప్పో(వన్ ప్లస్ ఇండియా ఆర్&డి  సెంటర్)లో ప్రతిష్టాత్మకమైన ఇంటర్న్‌షిప్-టు-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను పొందారు. ప్రతి ఒక్కరికి రూ. 30,000 నెలవారీ స్టైఫండ్‌‌తో ఇంటర్న్‌షిప్‌ ప్రారంభమవుతుంది. విజయవంతంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన తర్వాత, రూ. 19 లక్షల ఆకట్టుకునే వార్షిక ప్యాకేజీతో పూర్తి-సమయ ఉద్యోగాల్లోకి వారిని తీసుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా ఆరుగురు విద్యార్థులు సీమెన్స్ నుండి ప్లేస్‌మెంట్ ఆఫర్‌లను అందుకున్నారు, ఇది క్యాంపస్ తమ విద్యార్థులకు అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందించడంలో చూపే నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది.
 
ఈ మైలురాయి గురించి కెఎల్‌ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ, “జీవితాంతం విద్యార్థులను శక్తివంతం చేసే విజ్ఞానాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రపంచ ప్రభావాన్ని చూపగల భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. సర్టిఫికేషన్లు, నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారించడం ద్వారా, మేము మా విద్యార్థులను పోటీ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టడానికి సిద్ధం చేయనున్నాము. ఈ అత్యుత్తమ ప్లేస్‌మెంట్ ఆఫర్‌లు మా క్యాంపస్‌లలో మేము పెంపొందించే విద్యా నైపుణ్యం, ఆవిష్కరణ, వాస్తవ-ప్రపంచ సంసిద్ధతకు శక్తివంతమైన ఆమోదం” అని అన్నారు. 
 
2026 బ్యాచ్ విద్యార్థులు తమ పరివర్తన ప్రయాణాల పట్ల తమ సంతోషాన్ని పంచుకున్నారు. సుంకర సృజన్ భార్గవ్(బిటెక్ ఏఐ&డిఎస్) మాట్లాడుతూ, “కెఎల్‌హెచ్‌‌లో, పాఠ్యపుస్తకాలకు మించి వెళ్లమని మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. కోడింగ్ బూట్‌క్యాంప్‌లు, లైవ్ ప్రాజెక్ట్‌లు, ఇంటర్న్‌షిప్‌లు నిజంగా జాతీయంగా పోటీ పడటానికి మాకు అద్భుతమైన అవకాశం అందించాయి” అని అన్నారు. 
 
కొత్తపల్లి లక్ష్మీ త్రిభువన(బిటెక్ హానర్స్ సీఎస్ఈ- ఏఐ&ఎంఎల్ ) మాట్లాడుతూ “మా ప్రొఫెసర్స్ నాకు కోడ్ చేయడం మాత్రమే నేర్పించలేదు, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమస్యలను పరిష్కరించడం, ఆవిష్కరణలు చేయడం వారు నేర్పించారు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ నియామకం ఒక కల నిజమైనట్లు అనిపిస్తుంది” అని అన్నారు. 
 
సాయి లక్ష్మీకాంత్(బిటెక్ సీఎస్ఈ) మాట్లాడుతూ “హ్యాకథాన్‌లు, టెక్ ఫెస్ట్‌ల నుండి ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం వరకు, కెఎల్‌హెచ్‌ మాకు సిద్ధాంతం, ఆచరణాత్మక అనుభవం యొక్క ఆదర్శ మిశ్రమాన్ని ఇచ్చింది. సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ నిజంగా నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది” అని అన్నారు. కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ అకెల్ల, తరగతి గది జ్ఞానాన్ని వాస్తవ-ప్రపంచ ఉపయోగాలతో అనుసంధానించడంలో అధ్యాపకులు, సిబ్బంది, ప్లేస్‌మెంట్ & శిక్షణ సెల్ యొక్క కీలక పాత్రను వెల్లడించారు. ప్రసిద్ధ కంపెనీల ఎంపిక ప్రక్రియలు కఠినంగా వుంటాయని ఆయన చెబుతూ- బహుళ మూల్యాంకనాలు, సాంకేతిక ఇంటర్వ్యూలు, రియల్-టైమ్ సమస్య పరిష్కార రౌండ్లు వీటిలో ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments