జేఈఈ సెషన్-2 ఫలితాలు విడుదల

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2022 (10:29 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకై నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. 
 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం (ఆగస్టు 8) ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. 
 
జేఈఈ మెయిన్స్‌ ద్వారా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ ఆగస్టు 28న జరగనుంది.
 
ఈసారి కటాఫ్ అంచనాలు :
జనరల్ అభ్యర్థులకు 87.89
ఈడబ్ల్యూఎస్ 66.22
ఎస్సీలకు 46.88
ఎస్టీలకు 34.67
 
ఈసారి జేఈఈ పరీక్షను ఎన్‌టీఏ రెండు సెషన్లలో నిర్వహించింది. మొదటి సెషన్ జూన్ 23 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఈ సెషన్ ఫలితాలను జూలై 12న విడుదల చేశారు. 
 
మొదటి సెషన్‌కు మొత్తం 8,72,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రెండో సెషన్ జూలై 25 నుంచి జూలై 30 వరకు నిర్వహించారు. 
 
ఈ సెషన్‌కు 6,29,778 మంది హాజరయ్యారు. విద్యార్థులు రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. రెండింటిలో బెస్ట్‌ మార్క్స్‌ను మెరిట్‌గా పరిగణిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments