Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రోలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (12:09 IST)
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 
 
ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్చేస్ అండ్ స్టోర్స్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నేషనల్ కెరీర్ సర్వీసెస్ (ఎన్‌సీఎస్‌) పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్షను బెంగళూరు, చెన్నై, భోపాల్, అహ్మదాబాద్, గువాహటి తదితర పట్టణాల్లో నిర్వహిస్తారు. 
 
మొత్తం పోస్టులు: 24
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 21
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
 
ఇందులో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ 6, అకౌంట్స్‌ ఆఫీసర్‌ 6, పర్చేజ్‌ అండ్‌ స్టోర్‌ ఆఫీసర్‌ 12 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, పర్చేజ్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం ఎంబీఏ, డిగ్రీ, పీజీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. 
అకౌంట్స్‌ ఆఫీసర్‌ కోసం ఏసీఏ, ఎఫ్‌సీఏ లేదా ఏఐసీడబ్ల్యూఏ, ఎఫ్‌ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీకామ్‌, ఎంకామ్‌లలో ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 35 ఏండ్లలోపువారై ఉండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments