Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్కాన్‌లో 74 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇంజనీరింగ్ విద్యార్థులకు పండగే

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:06 IST)
భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఇర్కాన్‌)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఇర్కాన్‌ సూచించింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 18 వరకు అందుబాటులో ఉంటాయి. 
 
ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఇంజినీరింగ్‌ విభాగంలో 74 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. ఎంపికైన అభ్యర్థులు ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, బీహార్‌, సిక్కిం, మధ్యప్రదేశ్‌, త్రిపుర, గుజరాత్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో సివిల్‌ వర్క్స్‌ ఇంజినీర్‌ 60, ఎస్‌ అండ్‌ టీ వర్క్స్‌ ఇంజినీర్‌ 14 చొప్పున ఖాళీలు ఉన్నాయి. 
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 18
 
అర్హతలు: బీటెక్‌లో సివిల్‌ ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ క్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం తప్పనిసరి.
 
ఎంపిక విధానం: రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments