ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి వార్షిక వేతనం రూ.1.5 కోట్లు!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (10:56 IST)
ఖరగ్‌పూర్ ఐఐటీ విద్యార్థిని అదృష్టదేవత వరించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో భాగంగా ఆ విద్యార్థికి రూ.1.5 కోట్ల వార్షిక వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకువచ్చింది. 
 
క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఓ విద్యార్థికి ఇంత భారీ ప్యాకేజీ లభించడం ఇదే మొదటిసారి అని ఖరగ్‌పూర్ ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సదరు విద్యార్థికి కలిగే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని అతని పేరు కానీ, ఆఫర్ ఇచ్చిన సంస్థ పేరు కానీ వెల్లడించడం లేదని తెలిపాయి.
 
కాగా, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 27 కంపెనీలు పాలుపంచుకోగా, 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ఛైర్మన్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు. 
 
ఈ యేడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మన దేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు. 
 
విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించినట్టు చెప్పారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రిని అన్‌ఫాలో చేసిన విజయ్ కుమారుడు జాసన్ విజయ్

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్- సన్స్ టైటిల్

నేను పెళ్లి చేసుకునే ముందు.. నా అమ్మకు తోడు వుండాలి.. సుప్రీత

Varalaxmi: ఈ ప్రపంచంలో ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని శరత్ కుమార్

Ram Charan: పెద్ది డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

Show comments