Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో మూతపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు...

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (11:25 IST)
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనికితోడు కాలేజీల నిర్వహణాబారం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో అనేక కాలేజీలు మూతపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. 
 
హైదరాబాద్, జేఎన్‌టీయూ పరిధిలో 2020-21కి సంబంధించి ఇప్పటికి 8 కళాశాలలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్కోదాంట్లో 300 సీట్లు ఉన్నాయనుకున్నా 2,400 సీట్లు తగ్గడం ఖాయమైంది. 25 వరకు కోర్సులు ఎత్తివేస్తామంటూ మరికొన్ని కళాశాలలు అనుమతి కోరాయి. ఇలా 1,500 సీట్లు తగ్గనున్నాయి. ఈ మూడు రోజుల్లో వచ్చే దరఖాస్తులనూ పరిగణిస్తే 7 వేల వరకు సీట్లు రద్దవుతాయి.
 
ఇకపోతే, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ అయ్యాక అక్కడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరోవైపు అనుబంధ గుర్తింపు జారీకి అధికారులు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారు. లోపాలు బయటపడితే గుర్తింపు, కోర్సులకు అనుమతి నిరాకరించొచ్చు. అప్పుడు మరికొన్ని తగ్గి మొత్తం సీట్ల సంఖ్య 80 వేల దిగువకు పడిపోవచ్చు. 
 
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్‌ కళాశాలల్లో మొత్తం 91,988 (14 ప్రభుత్వ కళాశాలల్లో 3,058, 169 ప్రైవేటు కళాశాలల్లో 88,930) సీట్లున్నాయి. వీటిలో ఈసారి ప్రైవేటులో 9 వేలకు పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments