Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్లు ముద్రించే గవర్నమెంట్ పోస్టు కావాలనుకుంటున్నారా? దరఖాస్తు చేసుకోండి

పెద్దనోట్లపై ప్రస్తుతం దేశంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దేశంలో 86శాతం నోట్లను ఒక్కసారిగా రద్దు చేసే సరికి ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. నోట్ల కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నోట్లను రద్దు చేస్త

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (15:14 IST)
పెద్దనోట్లపై ప్రస్తుతం దేశంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దేశంలో 86శాతం నోట్లను ఒక్కసారిగా రద్దు చేసే సరికి ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. నోట్ల కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నోట్లను రద్దు చేస్తామని ముందే తెలినప్పుడు ముందే భారీ సంఖ్యలో నోట్లు ముద్రించుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. కానీ అతి రహస్యంగా నోట్లను రద్దు చేయాలనే కారణంతోనే ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో దేశంలోని అన్ని నోట్ల ముద్రణా కేంద్రాలు విరామం లేకుండా పనిచేస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తోంది. తన ప్రెస్‌లో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంకేముంది.. నోట్లు ముద్రించే గవర్నమెంట్ పోస్టు కావాలనుకుంటున్నారా.. అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి. నోట్లు ముద్రించే ఉద్యోగానకి 55శాతం మార్కులతో డిగ్రీ పాసైతే చాలు. నాసిక్ కేంద్రంలో 15 పోస్టులున్నాయి. 
 
వయోపరిమితి విషయానికి వస్తే డిసెంబరు 30 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య జన్మించి ఉండాలట. నిమిషానికి 40 ఇంగ్లీషు పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాల టైపింగ్‌ చేయగలగాలి. కంప్యూటర్‌ స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. డిసెంబరు 30లోపు వెబ్‌సైట్‌: http://cnpnashik.spmcil.com వెబ్ సైట్లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments