Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలు... సీడీఎస్ 1 రిజిస్ట్రేషన్‌కు.. నవంబర్ 26 చివరి తేదీ..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (16:55 IST)
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2019 (సీడీఎస్ I) పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు నవంబర్ 26, 2018 చివరి తేదీ. అభ్యర్థులు యూపీఎస్సీఆన్‌లైన్‌డాట్ఎన్ఐసీడాట్ఎన్ అనే వెబ్‌సైట్లో సీడీఎస్ 1 పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2019 (సీడీఎస్ I) పరీక్షలు వచ్చే ఏడాది (2019) ఫిబ్రవరి 3వ తేదీన జరుగనున్నాయి. 
 
ఇప్పటికే సీడీఎస్ 2 పరీక్షలు ఈ ఏడాది ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా 41 కేంద్రాల్లో జరిగాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 41 మందిని డెహ్రాడూన్‌లోని మిలటరీ అకాడమీలో, నావీ అకాడమీ (ఎయిమల), ఎయిర్‌ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ (ప్రీ-ఫ్లైయింగ్)లకు ఎంపిక చేశారు. 32 ట్రైనింగ్ కోర్సులు, ఆఫీసర్లు ఈ ట్రైనింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3వ తేదీన జరిగే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2019 (సీడీఎస్ I) పరీక్షలు రాయాలనుకునే వారు ఐఎంఏ లేదా ఓటీఏలో గ్రాడ్యుయేషన్ పొందివుండాలి. ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్లు భారత నావీ అకాడమీ కోసం ఈ పరీక్షకు రాసుకోవచ్చు. సైన్స్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ విభాగంలో ఎంపికయ్యేందుకు ఈ పరీక్ష రాయవచ్చునని యూపీఎస్సీ తెలిపింది. 
 
సాధారణంగా ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీల్లో శిక్షణ పొందేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ప్రొవిషనల్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి వుంటుందని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments