Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త విధానానికి తెర తీస్తోన్న CBSE.. రెండు బోర్డ్ ఎగ్జామ్స్

Webdunia
సోమవారం, 5 జులై 2021 (23:39 IST)
సరికొత్త విధానానికి సీబీఎస్‌ఈ తెర తీస్తోంది. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని నిర్ణయించుకుంది. కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే... సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సిలబస్‌ ఎడ్యుకేషన్‌ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 
 
ఇందులో భాగంగానే 2021-2022 అకాడమిక్‌ ఇయర్‌కు గాను రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లను నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇకే బోర్డ్‌ ఎగ్జామ్‌ ఉండడం వల్ల పరీక్షలు రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. 
 
టర్మ్‌1, టర్మ్‌ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు.  
 
ఇక సిలబస్‌ విషయానికొస్తే.. రెండు టర్ముల్లో సిలబస్‌ వేరు వేరుగా ఉంటుంది. మొదటి టర్మ్‌ పరీక్షను 50 శాతం సిలబస్‌తో రెండవ టర్మ్‌ పరీక్షను మిగతా 50 శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. పరీక్షల సమయాన్ని 90 నిమిషాలుగా నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments