సీబీఎస్ఈ 10 - 12 తరగతులకు పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే..

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (08:50 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పది, 12వ తరగతుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బోర్డు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పబ్లిక్ పరీక్షలు వచ్చే యేడాది ఫిబ్రవరి నెల 15, 2025న 10వ, 12వ తరగతుల ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. 
 
షెడ్యూల్ ప్రకారం... ఇంగ్లీష్ మొదటి సబ్జెక్ట్ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. అయితే 12వ తరగతి పరీక్షలు ఎంటర్‌ప్రైన్యూర్షిప్ సబ్జెక్ట్ మొదలవుతాయి. సీబీఎస్ఈ.గవ్.ఇన్ (cbse.gov.in) పోర్టల్‌లు పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
 
మొదటిసారిగా పరీక్షల ప్రారంభానికి దాదాపు 86 రోజులు ముందుగానే షెడ్యూల్ ప్రకటించామని సీబీఎస్ఈ పేర్కొంది. గతేడాదితో పోల్చితే 23 రోజులు ముందుగా పరీక్షల తేదీ షీట్‌ను విడుదల చేశామని అధికారిక ప్రకటనలో తెలిపింది. పాఠశాలలు సకాలంలో ఎల్వోసీ సమర్పించడంతో ఇంత త్వరగా షెడ్యూల్ ప్రకటించడం సాధ్యమైందని వివరించింది.
 
కాగా 10వ, 12 తరగతులకు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ సీబీఎస్ఈ ఇటీవలే విడుదల చేసింది. 10వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1, 2025 నుంచి మొదలవుతాయి. 12వ తరగతి ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయని బోర్డు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments