Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (15:34 IST)
నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బోరాడా నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
సెక్యూరిటీ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీసర్ విభాగాలకు సంబంధించిన పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొత్తం ఐదు విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రకమైన అర్హతలు నిర్ణయించారు.
 
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలు తెలపనున్నారు . రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిగ్రీ అర్హత ఉండాలి. 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. 
 
ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 23 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడాలోని వివిధ బ్రాంచుల్లో పని చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments