Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెస్రాలోని బిట్ - బి ఫార్మసీ ప్రోగ్రామ్ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (15:39 IST)
మెస్రాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)లో బిఫార్మసీ ప్రోగ్రామ్ కోర్సుల్లో కొత్త విద్యా సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సు కాలపరిమితి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. అకడమిక్ మెరిట్, జేఈఈ మెయిన్ 2023, నీట్ యూజ్ 2023లో సంపాదించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. జేఈఈ మెయిన్స్, నీట్ అభ్యర్థులకు చెరి సగం సీట్లను కేటాయిస్తారు. 
 
ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా కలిగివుండాలి. 
 
ఈ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను అకడమిక్ మెరిట్ వెయిటేజి కింద పరిగణనలోకి తీసుకుంటారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్ స్థాయిలో 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. జేఈఈ మెయిన్ 2023 లేదా నీట్ 2023 అర్హత పొందివుండాలి. ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం తప్పనిసరి. 
 
జేఈఈ మెయిన్స్‌ 2023 / నీట్ యూజీ 2023లో 60 శాతం, అకడమిక్ మెరిట్‌కు 40 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుంగా రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000గా నిర్ణయించారు. జూన్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.bitmesra.ac.in అనే వెబ్‌సైటులో చూడొచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

బరోజ్ 3డీ లాంటి సినిమా నలభై ఏళ్ళుగా రాలేదు : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments