Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో పైలట్ ఓరియంటేషన్ దినోత్సవాన్ని నిర్వహించనున్న BAA ట్రైనింగ్

ఐవీఆర్
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (22:44 IST)
హైదరాబాద్: ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ విమానయాన అకాడమీలలో ఒకటైన BAA ట్రైనింగ్, ఏప్రిల్ 26, శనివారం ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు హైదరాబాద్‌లో తమ పైలట్ ఓరియంటేషన్ దినోత్సవాన్ని నిర్వహించనుంది. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ 8-2-409, రోడ్ నెం.6, గ్రీన్ వ్యాలీ, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ 500034 వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రవేశ రుసుము చెల్లించనవసరం లేదు. 
 
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఆకర్షణగా BAA ట్రైనింగ్ యొక్క ఇండియన్ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్ నిలుస్తుంది, ఇది ఎలాంటి విమానయాన అనుభవం లేని భారతీయ పౌరుల కోసం రూపొందించబడిన నిర్మాణాత్మక, సమగ్రమైన శిక్షణ మార్గం. దాదాపు రెండు సంవత్సరాలలోపుగానే, క్యాడెట్‌లు EASA వాణిజ్య పైలట్ లైసెన్స్‌ను పొందవచ్చు, DGCA థియరీ, లైసెన్స్ మార్పిడిని పూర్తి చేయవచ్చు. DGCA టైప్ రేటింగ్‌ను పొందవచ్చు, దీని ద్వారా వారు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలలో ఫస్ట్ ఆఫీసర్ పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
ఈ కార్యక్రమం యొక్క వైవిధ్య ప్రయోజనాల్లో ఒకటి దాని డ్యూయల్-లైసెన్స్ ట్రాక్ (EASA+DGCA), ఇది భారతదేశంలో, ప్రపంచ విమానయాన మార్కెట్‌లో కెరీర్ అవకాశాలను గణనీయంగా పెంచుతుంది. ఈ శిక్షణకు హాజరుకాబోయే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రం, గణితంతో 10+2 విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి.
 
పైలట్ ఓరియంటేషన్ డే హాజరైన వారికి ప్రోగ్రామ్ పరిజ్ఞానం కంటే ఎక్కువ అందిస్తుంది. ఇది విమానయాన నిపుణులతో ఉచిత వన్-ఆన్-వన్ కెరీర్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ఒక అవకాశం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ప్రోగ్రామ్ నిర్మాణం, లైసెన్సింగ్ మార్గాలు, ఆర్థిక ప్రణాళికపై మార్గదర్శకత్వంతో పాటు కెరీర్ దృక్పథం యొక్క వాస్తవిక చిత్రాన్ని పొందుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments