ఏపీలో గ్రూపు-1 ఉద్యోగాల నోటిఫికేషన్ - దరఖాస్తుల గడువు పొడగింపు

వరుణ్
బుధవారం, 24 జనవరి 2024 (12:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు వీుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. గత నాలుగున్నరేళ్ళుగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ జారీ చేయని ప్రభుత్వం... ఇపుడు గ్రూప్-1 నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఇందుకోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన దరఖాస్తు గడువు ఈ నెల 21వ తేదీతో ముగిసింది. దీంతో ఈ గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడగించింది. అయితే, ఇకపై మరోమారు పొడగించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీ పీసీఎస్సీ) స్పష్టం చేసింది. 
 
జనవరి 28వ తేదీ అర్థరాత్రి వరకు ఈ పోస్టులకు ఆశావహ నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పొడగింపు నిర్ణయం తీసుకున్నామని, మరోమారు పొడగించేది లేదని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టే మార్చి 17వ తేదీన గ్రూపు-1 ప్రిలిమ్స్ జరుగుతుందని తెలిపింది. గ్రూపు -1  ఉద్యోగాల దరఖాస్తు చేసుకునేందుకు https://psc.ap.gov.in అనే వెబ్‌‍సైట్‌ను సందర్శించాలని ఎపీపీఎస్సీ సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak: భగవంతుడు లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం : విశ్వక్ సేన్

మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల కానున్న సుమతి శతకం

Komali Prasad: సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మండవెట్టి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కోమ‌లి ప్రసాద్

మళ్లీ ట్రోల్స్‌ ఎదుర్కొంటున్న జాన్వీ - పెద్దిలో అతి గ్లామర్.. లెగ్గింగ్ బ్రాండ్‌ ప్రకటనలో కూడా?

సినిమాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది : ప్రకాష్ రాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

తర్వాతి కథనం
Show comments