Webdunia - Bharat's app for daily news and videos

Install App

185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వరుణ్
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ‌రీ హెల్త్ డైరెక్టరేట్ ప‌రిధిలో 185 మంది సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ల నియామ‌కానికి ఈ నెల 28, మార్చి 1 తేదీల్లో వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబ‌ర్ సెక్ర‌టరీ ఎం.శ్రీనివాస‌రావు మంగళవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21, 23, 26 తేదీల్లో నిర్వ‌హించాల‌నుకున్న వాకిన్ రిక్రూట్మెంట్‌కు బ‌దులు ఈ నెల 28, మార్సి 1 తేదీల్లో నిర్వ‌హిస్తామ‌ని, అనివార్య కార‌ణాల‌ వ‌ల్ల వాకిన్ రిక్రూట్మెంట్ తేదీలను రీషెడ్యూల్ చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
రెగ్యుల‌ర్‌, కాంట్రాక్ట్‌, కొటేషన్ ప‌ద్ధ‌తిలో పోస్టుల్ని భ‌ర్తీ చేస్తామన్నారు. ఉద‌యం 10 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు డైరెక్ట‌రేట్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ , 77-2-జి, ల‌క్ష్మి ఎలైట్ బిల్డింగ్‌, పాతూర్ రోడ్‌, తాడేప‌ల్లి, గుంటూరు జిల్లా చిరునామాలో నిర్వ‌హించే వాకిన్ రిక్రూట్మెంట్ కు అర్హ‌త గ‌ల అభ్య‌ర్థ‌లు స్వ‌యంగా హాజ‌రుకావాల‌ని తెలిపారు. 
 
వైద్య ఆరోగ్య శాఖ‌లో ఎప్పుడు ఏర్ప‌డిన ఖాళీలను అప్పుడే భ‌ర్తీ చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైఎయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు నిరంత‌ర నియామ‌క ప్ర‌క్రియను కొనసాగిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. జ‌న‌ర‌ల్ మెడిసిన్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, డెర్మ‌టాల‌జీ, ఆర్థోపెడిక్స్‌, రేడియాల‌జీ, ఫొరెన్సిక్ మెడిసిన్ విభాగాల‌కు ఈ నెల 28న‌, గైన‌కాల‌జీ, పిడియాట్రిక్స్‌, అనెస్థీషియా, ఇఎన్ టి, అఫ్తాల్మ‌లాజీ, ప‌థాల‌జీ విభాగాల‌కు మార్చ్  ఒక‌టో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం http://apmsrb.ap.gov.in/msrb/ మరియు https://hmfw.ap.gov.in వెబ్సైట్లను చూడొచ్చని శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments