Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద విద్యార్థులకు శుభవార్త: ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు పేదలకే..

Webdunia
శనివారం, 6 జులై 2019 (13:21 IST)
కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పేద కుటుంబంలోని పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్రైవేట్ స్కూళ్లలో కూడా చదువుకునేలా చర్యలు తీసుకుంది. దేశంలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు కనీసం 25 శాతం సీట్లను కేటాయించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది.
 
విద్యా హక్కు చట్ట ప్రకారం విద్య అనేది అందరి ప్రాథమిక హక్కు. ఈ హక్కు 6-14 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలందరికీ వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్‌ నిశాంక్‌ లోక్‌సభలో మాట్లాడారు. అన్ని ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్, స్పెషల్‌ కేటగిరీ స్కూళ్లలో 25 శాతం సీట్లను బడుగు, బలహీన, వెనకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిందేనని స్పష్టం చేసారు.
 
ఈ పిల్లలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన లోక్‌సభలో స్పష్టం చేసారు. సంబంధిత రాష్ట్రాలు నిర్ణయించిన ఫీజుల ప్రకారమే ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ప్రకటించారు. 
 
కాగా ఈ 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న స్కూళ్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండదని స్పష్టం చేసారు. అయితే సంబంధిత పాఠశాలలు ప్రభుత్వం నుండి భూమి, వసతి, పరికరాలు ఉచితంగా లేదా తక్కువ ధరకు పొందవచ్చని మంత్రి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments